Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన విచారణ కమిషన్‌కు సంబంధించి మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కమీషన్ చైర్మన్ పీసీ ఘోష్ తో జరిగిన జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు ప్రాజెక్టు పనులు పూర్తిగా క్యాబినెట్ ఆమోదంతోనే జరిగాయన్నారు. మెడిగడ్డ పనులకు క్యాబినెట్ ఆరు సార్లు ఆమోదం తెలిపింది. అలాగే శాసనసభలో కూడా మూడుసార్లు ఆమోదం పొందింది. ఈ విషయాలకు సంబంధించి డాక్యుమెంట్లను పూర్తిగా కమీషన్‌కు అందజేశాం. కానీ,…
తెలంగాణ తాజా రాజకీయం మొత్తం... కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూనే తిరుగుతోంది. కుంగుబాటుపై కమిషన్ విచారణ చివరి దశకు వచ్చిన క్రమంలో... ఇప్పుడు పొలిటికల్ హాట్‌గా మారిపోయింది. ప్రాజెక్ట్ అనుమతులు, నిర్మాణం, సాంకేతిక వివరాలకు సంబంధించి ఇప్పటికే 113 మందిని విచారించి వివరాలు రాబట్టింది కమిషన్. అందులో అన్ని విభాగాలకు చెందిన వారు ఉన్నారు.