Harish Rao : తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో డైరీ ఆవిష్కరణలు ఉద్యమ కేంద్రాలుగా నిలిచినట్లు గుర్తు చేస్తూ, ఉద్యమకాలపు జ్ఞాపకాలు తాజా డైరీలో ఉంటాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం లక్ష్యం నేటి డైరీ ఆవిష్కరణ…