Harish Rao: మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదు..
- నాసరపురలోని బ్రిడ్జ్ స్కూల్ లో విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేసిన హరీష్ రావు
- చలికాలంలో విద్యార్థులు వేడినీళ్లు రాక, దుప్పటి రాక ఇబ్బంది పడుతున్నారు
- గత నాలుగు నెలల నుండి మెస్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి- హరీష్ రావు
- ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు గడప దాటడం లేదు- హరీష్ రావు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్ధిపేట నాసరపుర కేంద్రంలోని బ్రిడ్జ్ స్కూల్‌లో మాజీ మంత్రి హరీష్ రావు విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. చలికాలంలో విద్యార్థులు వేడినీళ్లు రాక, దుప్పటి రాక ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. గత నాలుగు నెలల నుండి మెస్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ పెట్టి రాష్ట్రంలో ఒక్క రూపాయి బిల్లు పెండింగ్ లేదు అని అన్నారు కానీ.. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని హరీష్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాటడం లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి తప్ప చేతల ముఖ్యమంత్రి కాదని హరీష్ రావు విమర్శించారు.
Read Also: Borewell Incident: 6 రోజులుగా బోరు బావిలోనే మూడేళ్ల బాలిక.. కాపాడాలని వేడుకుంటున్న తల్లి..
Also Read
పరిపాలన మీద మీరు పట్టు కోల్పోయారా.. ప్రభుత్వం ఫెయిల్ అనిపిస్తుందని హరీష్ రావు చెప్పారు. ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదు.. ముఖ్యమంత్రి మాటలు అధికారులు వినడం లేదా లేక ముఖ్యమంత్రి ఊరికే చెప్పానని అధికారులకు చెబుతున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అంటే అధికారులకు భయం లేదా విలువ లేదా అని విమర్శించారు. తక్షణమే అన్ని చోట్ల మెస్ ఛార్జీలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. అన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకొని ఎందుకు రివ్యూ చేయడం లేదని అన్నారు. ఢిల్లీ పైసలు ఇచ్చినా.. గల్లీ విడుదల చేయడం లేదని హరీష్ రావు ఆరోపించారు.
Read Also: Pawan Kalyan: “ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు”.. అభిమానులపై పవన్ ఫైర్ (వీడియో)
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!