Harish Rao : రేవంత్ రెడ్డి చరిత్రలో ఏ రోజు జై తెలంగాణ అనలేదు…ఉద్యమంలో పాల్గొనలేదు
- డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చిందంటే కారణం కేసీఆర్
- కానీ ఎవరో దయతో వచ్చిందని సీఎం చెబుతుంటే ఇది తెలంగాణ ఉద్యమం, అమరులను అవమాన పరచడమే
- తెలంగాణకి నంబర్ వన్ విలనే కాంగ్రెస్ పార్టీ : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి చరిత్రలో ఏ రోజు జై తెలంగాణ అనలేదు…ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రకటన వచ్చిందంటే కారణం కేసీఆర్ అని, కానీ ఎవరో దయతో వచ్చిందని సీఎం చెబుతుంటే ఇది తెలంగాణ ఉద్యమం, అమరులను అవమాన పరచడమే అని ఆయన మండిపడ్డారు. తెలంగాణకి నంబర్ వన్ విలనే కాంగ్రెస్ పార్టీ అని ఆయన విమర్శించారు. 2001 లో కేసీఆర్ పార్టీ పెట్టకపోతే తెలంగాణ అనే మాటే లేదు కదా అని, తెలంగాణ అనే పదం అసెంబ్లీలో ఆనాడు నిషేధించారని, 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 16 ఏళ్ల టీడీపీ పాలనలో తెలంగాణ అనే పదం లేకుండా చేశారన్నారు హరీష్ రావు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉండి డిల్లీలో 32 రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించారని, 2004 నుంచి 2009 వరకు మాతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు.
Atala Mosque Row: “అటాలా మసీదు కాదు, ఆలయం”.. కోర్టుకు చేరిన వివాదం..
Also Read
అంతేకాకుండా..’నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన లేకపోతే జూన్ 2 లేదు. ఆనాడు రేవంత్ రెడ్డిని తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే రాజీనామా చేయలేదు. చంద్రబాబుని రాజీనామా చేయమంటే తుపాకీ పట్టుకుని వచ్చాడు రేవంత్ రెడ్డి. చిదంబరం నుంచి తెలంగాణ ప్రకటన వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్. ఈ సత్యాన్ని ఏమార్చాలని కాంగ్రెస్ చూస్తోంది. నెహ్రూ, గాంధీ పోరాటం వల్ల కాదు బ్రిటిష్ వాళ్లే దయతలిచి స్వాతంత్ర్యం ఇచ్చారు అన్నట్టు రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయి. తెలంగాణ గురించి సీఎం రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేకుంటే నీ రెండు కళ్ళ సిద్ధాంతం గుర్తుకు వస్తుంది. సోనియాగాంధీని బలి దేవత అన్న రేవంత్ రెడ్డినే ఇప్పుడు అదే నోటితో దేవత అంటున్నారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి మేమే తెలంగాణ తెచ్చామని చెబితే అయిపోతోందా.. ఎక్కడ అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు అని సీఎం రేవంత్ చెప్పారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో జూన్ 2 2015లో అధికారికంగా పెట్టాము. గ్రామాల్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలను రేవంత్ రెడ్డి ఇప్పుడు తొలగిస్తారా..? జూన్ 22 2023నాడు సెక్రటేరియట్ వద్ద కేసీఆర్ తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఉన్న తెలుగుతల్లి విగ్రహాన్ని ఎవరైనా మార్చారా. నువ్వు మార్చాల్సింది ప్రజల బతుకు విగ్రహాల మార్పు కాదు. తెలంగాణా ఉద్యమం చరిత్ర రాస్తే రేవంత్ రెడ్డిది అందులో ద్రోహ చరిత్రే ఉంటుంది’ అని హరీష్ రావు అన్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
-
Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
-
El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
LPG Subsidy: మీకు ఎల్పీజీ సబ్సిడీ రావడం లేదా..? అయితే రేపటి లోగా ఇలా చేయండి..
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!