Harish Rao : వంద కాదు 180 రోజులైనా 6 గ్యారంటీలకు దిక్కులేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తొర్రూరులో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో ఆలోచనలు కల్పించి మభ్యపెట్టిందని, బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పై పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలన్నారు. 6 గ్యారంటీలు 13 హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామని మోసం చేశారని, వంద కాదు 180 రోజులైనా 6 గ్యారంటీలకు దిక్కులేదన్నారు హరీష్ రావు. నిరుద్యోగ భృతి రాలేదు, ఉద్యోగాలు రాలేదని, చేసేది లేక దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నరని ఆయన అన్నారు. ఆగష్టు 15 లోగా చెప్పిన హామీలు అమలు చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా, మల్లా పోటీ కూడా చెయ్యను అని చెప్పానని, రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం నేను సవాల్ విసిరానన్నారు. ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడని, దొడ్డు వడ్లను బోనస్ ఇవ్వము అన్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు హరీష్ రావు.
అంతేకాకుండా..’రైతుల చెవుల్లో పువ్వులు పెడుతున్నడు. ఒక్క ఉద్యోగం కూడా ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇచ్చి పూర్తి చేయలేదు. 30 వేల కెసిఆర్ ఉద్యోగాలను కాంగ్రెస్ వే అని ప్రచారం చేసుకున్నారు. వంట అయిపోయిన తర్వాత వచ్చి గరిటె తిప్పినట్లుంది కాంగ్రెస్ పరిస్థితి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మరో ఆర్నెల్ల సమయం మాత్రమే ఉంది. చెప్పినట్లుగా ఉద్యోగాలు ఇవ్వకుంటే నిన్ను వదిలిపెట్టరు. నిరుద్యోగులు. వదిలిపెట్టది టిఆర్ఎస్ పార్టీ. మెగా డిఎస్సీ అని మొండి చేయు చూపారు. రూపాయి తీసుకోబోమని పరీక్షల ఫీజులు డబుల్ చేశారు. ఆరు నెలలు అయినా కస్తూర్బా టీచర్లను పర్మినెంట్ చెయ్యలేదు. బయట ఉన్నపుడు మస్తు మాట్లాడాడు.
Also Read
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
కుర్చీలో కూర్చున్న తర్వాత అర్థం అవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం బండి వెనక్కి పోతున్నది. పథకాలు రద్దు అవుతున్నాయి. కరెంట్ ఫీజులు, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడానికి సిద్ధం అవుతున్నాడు. సామాన్యులకు కోతలు, వాతలు..ఇదే రేవంత్ ప్రభుత్వం అందుకే ఓడగొట్టి సురుకు పెట్టాలి. అసెంబ్లీలో మేము పోరాటం చేస్తం. మండలిలో రాకేష్ రెడ్డి పోరాటం చేస్తారు. జర్నలిస్టులకు రేవంత్ రెడ్డి మొండి చెయ్యి చూపారు. అన్ని శాఖల ఉద్యోగులను వేధిస్తున్నారు. కరెంట్ పోతే విద్యుత్ ఉద్యోగుల తప్పా.. బీజేపీ పాలనలో పేదరికం, నిరుద్యోగం పెరిగింది. పట్టభద్రులు, మేధావులు ఆలోచించాలి. బి ఆర్ ఎస్ అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా.’ అని హరీష్ రావు అన్నారు.
తాజావార్తలు
-
Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
-
Mirzapur The Movie: థియేటర్లలో ‘మిర్జాపూర్’ మాస్ జాతర!.. మూడు రోజుల్లోనే రూ.100 కోట్లకు..
-
Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Lemon Prices Surge in Hyderabad: నిమ్మకాయ ధరలకు రెక్కలు.. చికెన్‌తో పోటీ పడుతున్న ధరలు
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!