Harish Rao : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్రోహుల చేతిలోకి వెళ్ళింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ పై మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ద్రోహుల చేతిలోకి వెళ్ళిందన్నారు. అవినీతిపరుల పార్టీగా మారిందని ఆయన విమర్శించారు. నోటుకు ఓటు కేసులో పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు. 50 కోట్లు పెట్టి టీపీసీసీ పదవి రేవంత్ రెడ్డి కొనుక్కున్నాడని ఆ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడని మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఆ డబ్బులు ఓ ఎంపీ ద్వారా ఇచ్చాడని ఆరోపణలున్నాయన్నారు. ఐదు కోట్లు.. పదేకరాల భూమికి ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారన్నారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సగం సీట్లలో కాంగ్రెస్ కు అభ్యర్థులులేరు.. పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి కాంగ్రెస్ లో ఉందన్నారు.
అంతేకాకుండా.. ‘సొంత నియోజకవర్గాల్లో గెలవలేని కాంగ్రెస్ నేతలు తమపై పోటీ చేస్తారట. కాంగ్రెస్ పార్టీ అంటే మోసానికి మారుపేరు. మాటలు ఎక్కువ చేతలు తక్కువ. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచి మహిళలను ఏడిపిస్తుంది. కడియం శ్రీహరి, రాజన్న నాయకత్వం లో భారీ మెజారిటీతో బిఆర్ఎస్ ను గెలిపించాలి. రాజన్న కు భవిష్యత్తు ఉంది.. ఆయన అనుచరులు ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుంటాం. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుంది. ‘ అని మంత్రి హరీష్ రావు అన్నారు.
Also Read
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!