సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్టు నెట్ వర్క్ లో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఇప్పటికి కొన్ని రాష్ట్రాల్లో దేవాలయాలుకు దళితులను రానివ్వట్లేదన్నారు. అంబేడ్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల ఈ రోజు ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతున్నామని, అంబేడ్కర్ చెప్పిన సూచనలు కొంతమంది మాత్రమే పాటిస్తున్నారన్నారు. ఒకప్పుడు జర్నలిజం కు ఇప్పటి జర్నలిజం వేరు.. చాలా మారిందని, ఈ దఫా లో అన్ని నియోజకవర్గాల్లో దళిత జర్నలిస్టులకు దళిత బంధు ఇస్తామన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే దేశం గర్వపడ్డది.. ఆ ఘనత సీఎం కేసీఆర్‌ది అని, మొన్న వచ్చిన నీట్ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీల రిజల్ట్స్ అద్భుతమని ఆయన అన్నారు.
Also Read : Ambati Rambabu: రోత స్టార్.. బూతు స్టార్.. పవన్ కళ్యాణ్
ఈ మధ్య విడుదలైన నీట్ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల రిజల్ట్ అద్భుతం. ప్రైవేటు కాలేజీలతో పోటీ పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలంగాణ తరహా ఎస్సీ, ఎస్టీ, ఎస్డీఎఫ్ ఇతర రాష్ట్రాల్లో కావాలని కొట్లాడుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ గురుకులాలు లేవు. కొన్ని రాష్ట్రాల్లో దేవాలయాలకు దళితులను రానించే పరిస్థితి లేదు.- ప్రతి లక్ష జనాభాకు తెలంగాణ 22 MBBS సీట్లతో ప్రథమస్థానంలో ఉంది. దళిత జాతి కోసం పని చేసే విధంగా దళిత జర్నలిస్టులు పని చేయాలి’’ అని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.
Also Read : Manipur Violence: అఖిలపక్ష సమావేశం తర్వాత అమిత్ షాను కలిసిన మణిపూర్ సీఎం.. ఏం జరిగింది?