పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ “హరిహర వీరమల్లు”.ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ.దయాకర్‌రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా గతంలో ఎప్పుడో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.ఈ సినిమా పవన్ కల్యాణ్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది.అయితే ఈ సినిమా గత కొంతకాలంగా ఆగిపోయిందంటూ తెగ వార్తలు వచ్చాయి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ మరియు పోస్టర్స్ రిలీజ్ చేసి మేకర్స్ సినిమాపై అంచనాలను పెంచేశారు.. కానీ ఇప్పటి వరకుఈ సినిమాపై ఎటువంటి అప్డేట్ లేకపోవడం అలాగే ఇన్ని సంవత్సరాలైనా సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకపోవడంతో పవన్ కల్యాణ్ అభిమానులలో ఈ సినిమా ఆగి పోయిందేమో అనే అభిప్రాయం మొదలయింది కానీ ఈ మూవీ మేకర్స్ తాజాగా పవన్ ఫాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ను అందించారు .తాజాగా ఈ సినిమాకు సంబంధించి ధర్మం కోసం యుద్ధం అంటూ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు .ఈ టీజర్ చూసి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఖుషి అవుతున్నారు..ఈ టీజర్ లో పవన్ కల్యాణ్ స్టంట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి .