Hardik Pandya Was Shocked to see Mahesh Babu Look at Anant Ambani Wedding: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అంబానీ కుటుంబసభ్యులు, అతిథుల మధ్య.. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో సహా టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు హాజరయ్యారు. సతీమణి నమ్రతా శిరోద్కర్, కూతురు సితారతో కలిసి అంబానీ పెళ్లికకి వెళ్లారు. అక్కడ సరికొత్త లుక్‌లో బాబును చూసిన వారంతా ఒక్కసారిగా స్టన్ అయ్యారు.
అనంత్ అంబానీ పెళ్లిలో మహేష్ బాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బ్లాక్ ఆండ్ బ్లాక్ ఔట్ ఫిట్, సూపర్ హెయిర్ స్లైల్, గడ్డంతో మహేష్ సరికొత్తగా కనిపించారు. సూపర్ స్టార్ నయా లుక్‌కు అందరూ ఫిదా అయ్యారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌తో మహేష్ మాట్లాడుతుండగా.. ఆ పక్కనే టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. బాబును చూసిన హార్దిక్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ‘ఏంట్రా.. ఇంత అందంగా ఉన్నాడు’ అన్నట్టు ఓ చూపు చూశాడు. ఇందుకు సంబందించిన వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లిలో మహేష్ బాబు భార్య నమ్రత, కూతురు సితార సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు.
Also Read: Anant Ambani Wedding: ఎందరో సెలెబ్రిటీస్ ఉన్నా.. అందరి కళ్లు మాత్రం ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు మీదే!
మహేష్ బాబు నయా లుక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్న తమ హీరో లుక్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు. మన రాజకుమారుడిని చూసి.. హాలీవుడ్, బాలీవుడ్ నటీనటులు కుళ్ళుకుంటున్నారు. మహేష్ బాబు ‘ఏమున్నాడు బాసు’ అని అంటున్నారు. ఇక అంబానీ పెళ్లిలో టాలీవుడ్ నుంచి వెంకటేష్, రామ్ చరణ్, రానా దగ్గుబాటి సతీసమేతంగా హాజరయ్యారు.
#MaheshBabu & #HardikPandya Eye Contact pic.twitter.com/OY4yLyuNZh
— Aadhan Telugu (@AadhanTelugu) July 13, 2024