Mahesh Babu dressing style in Anant Ambani Wedding: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌ల వివాహం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన ఈ వివాహానికి వ్యాపార, సినీ, క్రీడా.. అన్ని రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. అయితే వివాహ వేడుకలో ఎందరో సెలెబ్రిటీస్ ఉన్నా.. స్పెషల్ అట్రాక్షన్‌గా మాత్రం మన ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు నిలిచారు.
అంబానీ ఇంట పెళ్లికి మహేశ్ బాబు సతీసమేతంగా హాజరయ్యారు. శుక్రవారం (జులై 12) ఉదయం హైదరాబాద్ నుంచి ముంబై చేరుకొని.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహంకు హాజరయ్యారు. పెళ్లిలో మహేశ్ బాబు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. బ్లాక్ అండ్ బ్లాక్ షేర్వాణీలో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. మహేశ్ ఎయిర్ స్టయిల్‌కు అందరూ ఫిదా అయ్యారు. మహేశ్ ఎంట్రీతో విదేశీ సెలెబ్రిటీలను కూడా ఎవరూ పట్టించుకోలేదు. బాబుతో అందరూ సెల్ఫీలు, ఫొటోస్ దిగేందుకు ఆసక్తి చూపారు. ఇందుకు సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read: IND vs PAK: అంబటి రాయుడు హాఫ్ సెంచరీ.. పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం! 15 రోజుల్లో రెండు కప్స్
ఇటీవల గుంటూరు కారం సినిమాతో హిట్ కొట్టిన మహేశ్ బాబు.. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేయనున్నారు. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రం కోసం మహేష్ సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగానే భారీ జుట్టు పెంచుతున్నారు. ఇప్పటివరకూ తెరపై కనిపించని సరికొత్త లుక్‌లో మహేశ్ దర్శనమివ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 9న మహేశ్ పుట్టినరోజు కానుకగా సినిమాకు సంబంధించి ఏదైనా ప్రీవిజువల్ టీజర్ ఉంటుందా? లేదా మహేశ్ లుక్‌కు సంబంధించిన పోస్టర్ వస్తుందా? అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
That’s MAHESH BABU, A South Indian actor
AGE – 48
— Vineeth K (@DealsDhamaka) July 12, 2024
#MaheshBabu𓃵 SHAKED Whole Social media With a single video and picture 🔥
Looks adhurs 🫡 #SSMB29#AnantRadhikaWedding #Maheshbabu #SuperstarRajinikanth pic.twitter.com/BayadFDOgC
— WORLD CUP FOLLOWER (@BiggBosstwts) July 12, 2024