మహిళలపై దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిర చట్టాలు ఉన్నా ఇవి మాత్రం తగ్గడం లేదు. ఇక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అయితే ఇవి మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అయిన వారే మహిళలపై దారుణాలకు ఒడిగడుతున్నారు. కొత్తగా పెళ్లైన ప్రతి ఆడపిల్ల ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగుపెడుతుంది. కొన్ని సందర్భాల్లో స్వర్గంలా ఉండే అత్తారిల్లు కొందరికి మాత్రం నరకంలా ఉంటుంది. అలాగే పెళ్లై వారం కూాడా గడవకముందే ఓ నవవధువుకు నరకం చూపించారు ఆమె అత్తింటివారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఆగ్రాలో చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read: Dog shocks bride groom: పెళ్లి కొడుకుకు షాక్ ఇచ్చిన కుక్క.. ఎంతపని చేసిందంటే
అసలు విషయంలోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఓ నవ వధువుపై దారుణం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోడలిపై ఎన్నో నిందలు వేసిన అత్తా మామ ఆమె బట్టలు విప్పించి శీల పరీక్ష చేశారు. అంతటితో ఆగకుండా ఆమెను ఇంట్లో నుంచి గెంటేశారు. కూతురిలా చూడాల్సిన ఆ అత్తామామ చెప్పుకోలేని విధంగా హింసించారు. బట్టలు విప్పించి ఆమెపై నపుంసకురాలు అనే ముద్ర వేశారు. అంతటికి ఆగకుండా అదనపు కట్నం కోసం వేధించారు. పెళ్లి జరిగిన వారంలోనే ఆమెకు నరకం చూపించారు. మాటలతో మానసికంగా, తమ చేష్టలతో శారీరకంగా హింసపెట్టారు. నపుంసకురాలివని మమ్మల్ని మోసం చేశావని ఇంట్లో నుంచి గెంటేశారు. ఎంత వేడుకున్న ఆ అత్తమామ కనికరించలేదు. అదనపు కట్నం కోసం వేధించారు. అంతేకాకుండా ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో ఆ పెళ్లి కుమార్తె తన తల్లితో పాటే ఉంటుంది. దీంతో చేసేదేమి లేక అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లై వారం కాకముందే తనకు నరకం చూపించారని, నపుంసకురాలు అనే ముద్ర వేశారని పోలీసులకు తెలిపింది నవ వధువు. అంతేకాకుండా అదనపు కట్నం కోసం వేధించారని పోలీసులకు తెలిపింది. వారిపై కఠిన చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అత్తామామలపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఇలా నవవధువు బట్టలు విప్పించి అత్తమామ శీల పరీక్ష చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.