Sangareddy Crime: ఇన్స్టాగ్రామ్ లో యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు శ్రీహరి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
సంగారెడ్డి జిల్లా గుమ్మదిదల మండలం దోమడుగు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఇన్స్టా గ్రామ్లో ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురి చేశాడు. దీంతో.. ఆకతాయి వేధింపులు భరించలేక యువతి తేజస్విని ఆత్మహత్య చేసుకుంది. తేజస్విని బీ.ఫార్మసీ చదువుతోంది. తన ఇంటివద్ద నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో.. వెంటనే గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో యువతి మృతి చెందింది.