Haj Yatra 2026: మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత హజ్ కమిటీ, హజ్ 2026 యాత్ర కోసం దరఖాస్తుల స్వీకరణను అధికారికంగా ప్రారంభించింది. జూలై 31, 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చని మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మరి ఈ దరఖాస్తు ప్రక్రియ వివరాలను ఒకసారి చూద్దామా..
దరఖాస్తు చేసుకునే వ్యక్తులు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే ముందు మార్గదర్శకాలు, అండర్ టేకింగ్ mలను పూర్తిగా చదవాలి. ప్రత్యేకంగా, జూలై 31, 2025 లోపు జారీ చేయబడిన మిషన్-రెడబుల్ ఇండియన్ ఇంటర్నేషనల్ పాస్‌పోర్ట్ కనీసం డిసెంబర్ 31, 2026 వరకు వాలిడ్ ఉండటం తప్పనిసరి అని వివరించారు. అంతేకాకుండా ఏదైనా సమస్యల వల్ల, మరణం లేదా తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితుల మినహాయింపుతో హజ్ యాత్రను రద్దు చేసుకునే దరఖాస్తుదారులకు జరిమానాలు తప్పవని హెచ్చరించారు. కావున దరఖాస్తు చేసుకునే ముందు సన్నద్ధతను సక్రమంగా పరిగణలోకి తీసుకోవాలని హజ్ కమిటీ సూచించింది.
ఈ ప్రకటనతో భారత్‌లోని వేలాది మంది ముస్లింలకు హజ్ యాత్ర చేయడానికి మరొకసారి ప్రభుత్వం ద్వారా సౌకర్యవంతమైన అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత ప్రభుత్వం అందించే మద్దతుతో భక్తుల ఆధ్యాత్మిక సాధన మరింత సులభంగా మారుతుందన్నారు. గత వారం జరిగిన సమీక్షా సమావేశంలో, అల్పసంఖ్యాకుల వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ..
Read Also:ATM Robbery: జీడిమెట్లలో రెచ్చిపోయిన దొంగలు.. గంటలో మూడు ATMలు కొల్లగొట్టిన కేటుగాళ్లు..!
హజ్ 2025 భారతీయ భక్తుల కోసం ఇప్పటివరకు నిర్వహించిన అత్యుత్తమ యాత్రగా నిలిచిందన్నారు. 2024లో 200కు పైగా మృతులతో పోలిస్తే, 2025లో మృతుల సంఖ్య 64కి తగ్గడాన్ని ఆయన ముఖ్యంగా హైలైట్ చేశారు. హజ్ యాత్రలో భద్రతా ప్రమాణాలను పెంచిన ప్రభావంగా ఇది జరిగిందని పేర్కొన్నారు. హజ్ 2026 కోసం దరఖాస్తుల ఆహ్వానం ద్వారా భారత ప్రభుత్వం మరోసారి ఆధ్యాత్మిక యాత్రలో దేశీయ ముస్లిం సమాజానికి అనుసంధానంగా నిలుస్తోంది. ఆసక్తి ఉన్నవారు అర్హతలు, నిబంధనలు చదివి, తప్పకుండా పాస్‌పోర్ట్ సిద్దం చేసుకుని జూలై 31, 2025లోపు దరఖాస్తు చేయాలి. https://hajcommittee.gov.in అధికారిక వెబ్‌సైట్ లో మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు. దరఖాస్తు ముందు మార్గదర్శకాలను పూర్తిగా చదవడం మర్చిపోకండి.