Indigenous Anti Submarine: నేవీ సామర్థ్యంలో కీలక పురోగతి.. యాంటీ-సబ్‌మేరిన్ రాకెట్ పరీక్ష విజయవంతం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indigenous Anti Submarine: భారత నౌకాదళానికి సంబంధించి భారీ విజయంగా నిలిచే మరో అడుగు ముందుకువేసింది. పూర్తి స్థాయిలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఎక్స్‌టెండెడ్ రేంజ్ యాంటీ-సబ్‌మేరిన్ రాకెట్ (ERASR) ను విజయవంతంగా పరీక్షించామని అధికారికంగా ప్రకటించారు. జూన్ 23 నుండి జూలై 7 వరకు యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ కవరట్టి నుంచి ఈ ప్రయోగాలు నిర్వహించబడ్డాయి.
Read Also:ATM Robbery: జీడిమెట్లలో రెచ్చిపోయిన దొంగలు.. గంటలో మూడు ATMలు కొల్లగొట్టిన కేటుగాళ్లు..!
Also Read
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
ఈ పరీక్షల విజయంపై రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. DRDO, భారత నౌకదళాలు ఇంకా ఈ అభివృద్ధిలో భాగమైన పరిశ్రమలన్నింటినీ అభినందించారు. ఈ వ్యవస్థ విజయవంతంగా సేవలోకి రావడం భారత నౌకాదళ దాడి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది అని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇకపోతే, ఈ యాంటీ-సబ్‌మేరిన్ రాకెట్ వ్యవస్థ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది. దీని ప్రత్యేకత ట్విన్-రాకెట్ మోటార్ కన్ఫిగరేషన్. ఇది విస్తృత శ్రేణి లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో, స్థిరతతో కొట్టగలగడం. దీనివల్ల సముద్రపు లోతుల్లో దాగున్న శత్రు సబ్‌మేరిన్లను సమర్థవంతంగా ధ్వంసం చేయవచ్చు.
Read Also:AI+ Smartphone Launch: మార్కెట్లోకి దేశీ స్మార్ట్‌ఫోన్.. బెస్ట్ ఫీచర్స్, ధర కేవలం 5 వేలే!
తాజాగా మొత్తం 17 ERASR రాకెట్లు వివిధ పరిధుల్లో విజయవంతంగా పరీక్షించబడ్డాయి. రేంజ్ పనితీరు, ఎలక్ట్రానిక్ టైం ఫ్యూజ్ పనితీరు, వార్‌హెడ్ ఫంక్షనింగ్ వంటి అన్ని నిర్దిష్ట లక్ష్యాలు సాఫల్యంగా సాధించబడ్డాయని భారత నౌకాదళం తెలిపింది. ఈ రాకెట్ వ్యవస్థ ఇండక్షన్ తరువాత, భారత నౌకాదళం అండర్ వాటర్ యుద్ధరంగంలో మరింత సన్నద్ధంగా ఉండనుంది. శత్రు సబ్‌మేరిన్లను సమర్థంగా గుర్తించి ధ్వంసించగల ఈ ఇండిగేనోస్ టెక్నాలజీ భారత్ స్వయం సమర్థతను నిరూపించింది.
తాజావార్తలు
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?