Hafiz Saeed: భారత్‌కు వ్యతిరేకంగా జిత్తులమారి నక్క హఫీజ్ సయీద్ కొత్త ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నవంబర్ 2న లాహోర్‌లోని మినార్-ఎ-పాకిస్థాన్‌లో జరగాల్సిన లష్కరే తోయిబా ర్యాలీ అకస్మాత్తుగా రద్దు చేశారు. లష్కరే ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ఈ ర్యాలీ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఇటీవల ఆయన ఈ ర్యాలీకి సంబంధించి జనాన్ని ఉద్దేశించి ఒక వీడియోను విడుదల చేశాడు. ఈక్రమంలో భారత నిఘా సంస్థలు లాహోర్ ర్యాలీని నిశితంగా పరిశీలిస్తున్నాయి.…