Gun Violence: దక్షిణాఫ్రికాలోని రాజధాని ప్రిటోరియా సమీపంలోని సాల్స్విల్లే ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన భయంకర కాల్పులు స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి. ఈ దారుణ ఘటనలో 11 మంది మృతి చెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. దక్షిణాఫ్రికన్ పోలీస్ సర్వీస్ (SAPS) తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 4:15 గంటల తర్వాత ఈ హత్యాకాండ చోటుచేసుకుంది. అయితే పోలీసులకు సమాచారం ఉదయం 6 గంటల సమయంలో అందింది. గాయపడిన వారిని అత్యవసరంగా సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు.
Tragedy: విషాదం..ఖర్జూరం విత్తనం గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి
పోలీసుల ప్రాథమిక విచారణలో ఇది ముగ్గురు ఆయుధదారుల గ్యాంగ్ జరిపిన దాడి అని తేలింది. సమాచారం ప్రకారం.. వారు అకస్మాత్తుగా అక్కడ కూర్చున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ప్రజలు ఏం జరుగుతోందో అర్థం చేసుకునేలోపే అనేక మంది అక్కడికక్కడే కుప్పకూలారు. ప్రస్తుతం ఈ దుండగుల కోసం పెద్ద ఎత్తున సెర్చ్ ఆప్షన్ కొనసాగుతోంది. పోలీసులు ఈ ఘటనకు గల ప్రధాన కారణంగా అక్కడి అక్రమ మద్యం దుకాణాలను చూపుతున్నారు. లైసెన్స్ లేని బార్లు, పబ్లు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడే గొడవలు, హింసాత్మక ఘటనలు తరచూ జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
తక్కువ ధరలో ప్రీమియం అనుభవం.. Hisense E6N 65 అంగుళాల 4K స్మార్ట్ LED టీవీపై భారీ ఆఫర్లు..!