Love Couple Suicide: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలోని గౌరీ శంకర్ ప్యాలెస్ హోమ్‌స్టేలో ప్రేమజంట మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువకుడు, యువతి ప్రేమికులను తేల్చారు. మృతులను డియోరియా నివాసి ఆయుష్ కుమార్, బారాబంకిలోని దరియాబాద్‌కి చెందిన అరోమాగా గుర్తించారు.
బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. అర్రాలో దుండగుల ఆగడాలకు హద్దులు లేకుండా పోతున్నాయి. తాజాగా.. దుండగులు ముగ్గురు స్నేహితులను కాల్చారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
అమెరికాలో కేశంపేటకు చెందిన విద్యార్థని కాల్చి చంపారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట గ్రామానికి చెందిన గంప ప్రవీణ్ (27) మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రవీణ్ ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లాడు.