నేడు ఐపీఎల్ 2024లో అహ్మాదాబాద్ లోని మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకి గుజరాత్ టైటాన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం గుజరాత్ పాయింట్ల పట్టికలో 9 మ్యాచ్ లు ఆడి నాలుగింట్లో గెలిచి 7వ స్థానంలో కొనసాగుతుండగా.. ఇక, ఆర్సీబీ 9 మ్యాచ్ లు ఆడి కేవలం రెండిట్లో గెలిచి చివరి ప్లేస్ కొనసాగుతుంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు 3 మ్యాచ్ లు జరిగాయి. గుజరాత్ 2 సార్లు విజయం సాధించగా.. ఆర్సీబీ ఒకసారి గెలిచింది.
Read Also: KCR: నేడు వరంగల్ లో కేసీఆర్ బస్సుయాత్ర.. హనుమకొండ చౌరస్తాలో ప్రసంగం..
అయితే, ఆర్సీబీ ఆఖరి ప్లేస్ నుంచి ప్లే ఆఫ్ కి వెళ్లడం దాదాపు కష్టం అనే చెప్పుకోవాలి. కాకపోతే మిగిలిన జట్లు గెలుపుఓటముల మీద ఆధారపడి ఉంది. విరాట్ కొహ్లీ తనదైన ఫాంతో అద్భుతమైన బ్యాటింగ్ తో దూసుకుపోతున్నాడు. ఈ సీజన్ లో తనే టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఇక, గత మ్యాచ్ లో హైదరాబాద్ మీద విజయం సాధించిన ఆర్సీబీ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. గుజరాత్ మరో విజయం నమోదు చేయాలనే పట్టుదలతో ముందుకు వెళ్తుంది. అలాగే, బౌలింగ్ లో కూడా మహ్మద్ సిరాజ్ ఫామ్ లోకి రావడం ఆర్సీబీకి ఒక శుభ పరిణామమని చెప్పాలి.
Read Also: SRH vs CSK: సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరుకు చెన్నై సూపర్ కింగ్స్ బ్రేక్స్ వేయగలదా..?
ఇక, గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే కెప్టెన్ శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ లో తడబడుతున్నాడు. ఒక మ్యాచ్ లో ఆడితే, మూడు మ్యాచ్ ల్లో తొందరగా ఔట్ అయిపోతున్నాడు. మిగిలినవాళ్లు ఆడితే జట్టు గెలుస్తుంది. లేకపోతే ఓటమిని చవిచూస్తుంది. కాకపోతే బ్యాటింగ్, బౌలింగ్ అన్నింటా యావరేజ్ గానే జీటీ టీమ్ ఉంది. సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ బాగా ఆడుతున్నారు. కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, దర్శన్ లాంటి ప్లేయర్స్ బ్యాటింగ్ లో టచ్ లోకి వస్తే ఆర్సీబీపై విజయం ఈజీ అవుతుంది.