గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఓ పెద్ద ఉగ్రవాద కుట్రను బహిర్గతం చేసింది. భారత ఉపఖండంలోని అల్ ఖైదా (AQIS)తో సంబంధం ఉన్న మాడ్యూల్‌ను ఛేదించింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ అధికారుల ప్రకారం.. పట్టుబడిన నలుగురు ఉగ్రవాదులలో ఇద్దరు గుజరాత్, ఒకరు ఢిల్లీ, మరొకరు నోయిడా (ఉత్తరప్రదేశ్)కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఉగ్రవాదులందరూ అల్ ఖైదాకి చెందిన Al-Qaeda in the Indian Subcontinent తో సంబంధం కలిగి ఉన్నారని చెబుతున్నారు. అరెస్టయిన ఉగ్రవాదులను సైఫుల్లా ఖురేషి , మొహమ్మద్ ఫర్దీన్, మొహమ్మద్ ఫైక్, జీషన్ అలీగా గుర్తించారు.
READ MORE: Mumbai Airport: వరసగా మూడో ఏడాది టాప్-10 బెస్ట్ ఎయిర్‌పోర్టుల్లో ముంబై..
ఈ నలుగురు ఉగ్రవాదుల గురించి షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. వారు ఒక పెద్ద ఉగ్రవాద దాడికి ప్లాన్ చేస్తున్నట్లు తేలింది. యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ ప్రకారం.. నిందితులందరి వయస్సు 20 – 25 సంవత్సరాల మధ్య ఉంటుంది. వీళ్లు భారత్‌లో పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఉగ్రవాదులకు కొన్ని నిర్దిష్ట, సున్నితమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవాలని ప్లాన్ చేశారు. ఈ నలుగురు ఉగ్రవాదులు సోషల్ మీడియా యాప్‌ల ద్వారా ఒకరితో ఒకరు సంబంధాలు పెంచుకున్నారు. సరిహద్దు ఆవల ఉన్న ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్నారని దర్యాప్తులో తేలింది . ప్రస్తుతం ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఈ మొత్తం ఆపరేషన్‌కు సంబంధించిన వివరణాత్మక సమాచారాన్ని త్వరలో మీడియాకు వెల్లడిస్తామని.. యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ డీఐజీ సునీల్ జోషి తెలిపారు. ఈ అరెస్టును భద్రతా సంస్థలు సాధించిన పెద్ద విజయంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఒక పెద్ద ఉగ్రవాద కుట్ర సకాలంలో భగ్నం చేశారు.
READ MORE: Dacoit: అడవిశేష్, మృణాల్ ఠాకూర్లకు గాయాలు?
Gujarat ATS arrested four terrorists with links to AQIS (Al-Qaeda in the Indian subcontinent). A detailed process conference will be held: ATS DIG Sunil Joshi
(Pics: Gujarat ATS) pic.twitter.com/wm5jjYMvb1
— ANI (@ANI) July 23, 2025