Sri Vishnu : నా సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు.. శ్రీవిష్ణు క్లారిటీ
- అవన్నీ బూతులు కాదు
- శ్రీ విష్ణు కామెంట్స్
- సింగిల్ ట్రైలర్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Vishnu : హీరో శ్రీవిష్ణు గత సినిమాల్లో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్, ట్రోల్స్ వచ్చాయి. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు డైలాగులను స్పీడ్ గా చెప్పేసి అర్థం రాకుండా జాగ్రత్త పడ్డారని.. అందుకే వాటిని సెన్సార్ లో కట్ కాకుండా చూసుకున్నారంటూ పెద్ద ఎత్తున పోస్టులు వెలిశాయి. శ్రీ విష్ణు డబుల్ మీనింగ్ డైలాగులతో అనేక మీమ్స్, ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే వాటిపై తాజాగా శ్రీ విష్ణు స్పందించారు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ సింగిల్. కార్తీక్ రాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. మే 9న వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు.
Read Also : High Court: గ్రూప్-1 పిటిషనర్లకు జరిమానా విధించిన హైకోర్టు..
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో శ్రీ విష్ణును రిపోర్టర్లు ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్ పై ప్రశ్నించారు. దీనిపై శ్రీ విష్ణు స్పందిస్తూ.. ‘నా సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగులు లేవు. అది సంస్కృతం. అది చాలా మందికి అర్థం కాక అలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు వారందరికీ సంస్కృతం నేర్పించలేం కదా’ అంటూ శ్రీ విష్ణు చెప్పుకొచ్చారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీ విష్ణు నటిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. దీన్ని పూర్తి కామెడీ సినిమాగా తీసుకొస్తున్నారు. ఇందులో వెన్నెల కిషోర్, శ్రీ విష్ణు కామెడీ హైలెట్ కాబోతోంది.
Read Also : KTR : మాజీ మంత్రి కేటీఆర్‌కు గాయం.. బెడ్ రెస్ట్ సూచించిన వైద్యులు
Also Read
తాజావార్తలు
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!