ఐపీఎల్ 2023 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అయితే నేడు ఎకానా స్పోర్ట్జ్ సిటీ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడుతోంది. ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు లక్నో సూపర్ జెయింట్స్ మొత్తం 6 మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఇక గుజరాత్ టైటాన్స్ మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడి మూడు విజయాలు సాధించింది. రెండు మ్యాచ్‌లలో ఓడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్నది. ఈ మ్యాచ్‌లో విజయం ద్వారా పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపర్చుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

Also Read : Violence in Bengal : బెంగాల్‌లో మరోసారి హింస.. కలిగంజ్‌లో చెలరేగిన ఘర్షణలు
అయితే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న గుజరాత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 135 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. అయితే.. 136 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన లక్నో 55 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో కైల్ మేయర్స్(24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో లక్నో 55 పరుగుల వద్ద (6.3వ ఓవర్) తొలి వికెట్‌ను కోల్పోయింది. అయితే.. 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి లక్నో 80 పరుగు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (42), కృనాల్ పాండ్యా(14) క్రీజులో ఉన్నారు.
Also Read : Rahul Gandhi: నిజం మాట్లాడినందుకు మూల్యం.. బంగ్లా ఖాళీ చేసిన రాహుల్