లక్నో సూపర్ జెయింట్స్ (LSG) గుజరాత్ టైటాన్స్ (GT)ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఏప్రిల్ 12న (శనివారం) లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో ఘన విజయం సాధించింది. మొదట బరిలోకి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి180 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని లక్నో 4 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలుండగా ఛేదించింది. మార్‌క్రమ్ (58), నికోలస్ పూరన్…
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. గుజరాత్ నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. లక్నో జట్టు 6 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో రెండు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. కాగా.. టాస్ గెలిచిన రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొడుతోంది. తొలి మ్యాచ్‌లో ఓడిన లక్నో.. ఆపై హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన పోరులో లక్నో 33 పరుగుల తేడాతో గెలిచింది. దాంతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా టైటాన్స్‌పై లక్నో విజయం సాధించింది. అంతేకాదు ఇప్పటివరకు 160 ప్లస్ స్కోరు చేసిన 13 మ్యాచుల్లోనూ లక్నో విజయం సాధించడం విశేషం.…
Yash Thakur takes first Five-Wicket Haul in IPL 2024: ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ల హవా కొనసాగుతోంది. యువ బౌలర్లు మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్ ప్రత్యర్థి బ్యాటర్లను తమ బౌలింగ్‌తో హడలెత్తిస్తున్నారు. మయాంక్ అత్యంత వేగవంతమైన బంతిని వేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించగా.. తాజాగా యశ్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి మెయిడిన్ చేసిన బౌలర్‌గా యశ్ రికార్డుల్లోకెక్కాడు. అంతేకాదు ఐపీఎల్ 2024లో…
Ravi Bishnoi Sensational Catch Best In IPL Ever: ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ సూపర్ క్యాచ్‌తో మెరిశాడు. స్టన్నింగ్ రిటర్న్ క్యాచ్‌తో గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపాడు. విలియమ్సన్ కొట్టిన షాట్‌ను బిష్ణోయ్ అమాంతం గాల్లో ఎగిరి ఒంటి చేత్తో బంతిని పట్టుకున్నాడు. దీంతో సహచరులతో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో…
Navjot Singh Sidhu Praises KL Rahul: టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ నవ్‌జ్యోత్ సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్‌ను వాహన ‘స్పేర్ టైర్’తో పోల్చారు. అత్యవసర పరిస్థితుల్లో అతడిని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చన్నారు. రాహుల్ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ఎవరూ లేరని సిద్ధూ పేర్కొన్నారు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ నేపథ్యంలో నవ్‌జ్యోత్ సిద్ధూ ఈ వ్యాఖ్యలు చేశారు.…