Ministry of Environment: వయనాడ్ ప్రమాదం తర్వాత కేంద్రం అలర్ట్.. 6 రాష్ట్రాలకు గ్రీన్ ప్రొటెక్షన్!
- వయనాడ్లో కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మృతి
- ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
- పశ్చిమ కనుమలను పర్యావరణ సున్నిత ప్రాంతం (ఈఎస్ఏ)గా ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయనాడ్లో కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ కనుమలను పర్యావరణ సున్నిత ప్రాంతం (ఈఎస్ఏ)గా ప్రకటించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ను విడుదల చేసింది. కొండచరియలు విరిగిపడటం వల్ల సంభవించిన విషాదంలో వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన వయనాడ్ గ్రామాలు కూడా ఇందులో ఉన్నాయి. వయనాడ్లో ఇప్పటికీ ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 100 మందికి పైగా గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.
READ MORE: Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో ఎనిమిదో రోజు భారత్ షెడ్యూల్ ఇదే..
Also Read
- Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
- Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
- India-Russia: సంక్షోభం వేళ భారత్కు రష్యా భరోసా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
ప్రభుత్వ ముసాయిదాలో 6 రాష్ట్రాలలో 59940 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర ఈఎస్ఏ ఎంపిక చేయబడింది. ఇది పశ్చిమ కనుమల్లో దాదాపు 37 శాతం. 2022లో కూడా ఇదే విధమైన డ్రాఫ్ట్ విడుదలైంది. ప్రఖ్యాత పర్యావరణవేత్త మాధవ్ గాడ్గిల్ కమిటీ 2011లోనే దీన్ని సిఫార్సు చేసింది. 13 ఏళ్ల తర్వాత ఆయన నివేదికపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఈ నివేదికలో 75 శాతం విస్తీర్ణాన్ని ఈఎస్ఏ పరిధిలోకి తీసుకురావాలని సిఫారసు చేయగా, దానిని 37 శాతానికి తగ్గించారు. ముసాయిదా గడువు ముగియడంతో కొత్త నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.
READ MORE:Khairatabad Ganesh: ఈ ఏడాది ‘సప్తముఖ మహశక్తి గణపతి’గా ఖైరతాబాద్ గణేశ్
ప్రస్తుతం మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు కేరళ సహా ఇతర రాష్ట్రాల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చిన తర్వాత తుది నివేదికను సిద్ధం చేయనున్నారు. వయనాడ్లో విషాదం కారణంగా ఈ ముసాయిదాను సిద్ధం చేసినట్లు నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
-
Test Rankings: ICC టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల.. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్ రౌండర్ల విభాగాల్లో దుమ్మురేపిన టీమిండియా..
-
Tollywood: పర్సంటేజీ ఇష్యూ.. శిరీష్ రెడ్డికి మైత్రి రవి స్ట్రాంగ్ కౌంటర్
-
India-Russia: సంక్షోభం వేళ భారత్కు రష్యా భరోసా..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!