అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది. కానీ భారీ హిట్ మాత్రం అందుకోలేదు. చివరగా అఖిల్ ‘ఏజెంట్’ తో ప్రేక్షకులను పలకరించగా, ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. దీంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు అఖిల్. రెండేళ్ల గ్యాప్ తీసుకుని ప్రజంట్ తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ షెడ్యూల్ శరవేగంగా జరుగుతుంది.
Also Read: ‘Stree’ : నా నవ్వు అలానే ఉంటుంది.. అందుకే ఈ క్యారెక్టర్ కు తీసుకున్నారు: అమర్ కౌశిక్
శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తున్నా ఈ మూవీ.. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుందనే విషయం తెలిసింతే. అఖిల్ గెటప్, మాట కూడా పూర్తిగా చిత్తూరు యాసలో ఉండబోతుందట. అయితే ఈ ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు. నార్మల్ గా బర్త్ డే రోజు హీరో హీరోయిన్ ల చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్‌లు రివీల్ చేయడం ఆనావాయితిగా వస్తోంది. దీంతో అఖిల్ సినిమాకి సంబంధించిన అప్డేట్ వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఫ్యాన్స్ ఆశించినట్లుగానే అఖిల్ బర్త్ డే స్పెషల్ గా ఓ క్రేజీ అప్డేట్ రాబోతోంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. అంతే కాదు తాజా సమాచారం ప్రకారం అఖిల్ పై టైటిల్ సాంగ్‌ను షూట్ చేస్తారట. ఆ టైటిల్ సాంగ్ కోసం ప్రత్యేకంగా సెట్స్ కూడా వేస్తున్నారట. ఈ సాంగ్ లో అఖిల్ మాస్ స్టెప్స్ చాలా కొత్తగా ఉంటాయని టాలీవుడ్ టాక్.