పద్మవిభూషణ్ చిరంజీవిని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అభినందించారు. గవర్నర్ ఆహ్వానంతో ఈరోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి, సురేఖ రాజ్ భవన్ లో గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవికి శాలువా కప్పిన గవర్నర్ తమిళిసై... ఆయన పద్మ విభూషణ్ అందుకోబోతున్న నేపథ్యంలో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై.. చిరంజీవి సామాజిక సేవలని ప్రస్తావిస్తూ, పద్మవిభూషణ్ పురస్కారం పొందినందుకు అభినందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు.