Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Abdul Nazeer: కుడి భుజానికి శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ మర్యాదపూర్వకంగా పరామర్శించారు. పవన్ కల్యా్ణ్ నివాసానికి వెళ్లిన గవర్నర్.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యులు సూచించిన జాగ్రత్తలను తప్పకుండా పాటించాలని సూచించారు. త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.
పరామర్శ అనంతరం గవర్నర్, పవన్ కల్యాణ్ నివాసంలోని లైబ్రరీని కూడా సందర్శించారు. అక్కడ రచయితలు, పరిశోధకులు, విశ్లేషకులు, ప్రజా విధాన రూపకర్తలు రచించిన పలు విలువైన పుస్తకాలను పరిశీలించారు. పుస్తకాలలోని అంశాలు, సమకాలీన సామాజిక, పరిపాలనా, ప్రజా విధానాలపై పవన్ కల్యాణ్‌తో గవర్నర్ ఆసక్తికరంగా చర్చించారు. ఈ సందర్భంగా పవన్ అభ్యర్థన మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఒక పుస్తకంపై తన ఆటోగ్రాఫ్ కూడా చేశారు. ఈ ఆత్మీయ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
తన ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు స్వయంగా నివాసానికి వచ్చి పరామర్శించిన గవర్నర్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ చూపిన ఆప్యాయత, శుభాకాంక్షలు తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ కొద్దిసేపు పలు సమకాలీన అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్‌ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!