Aadi Srinivas: ఈటెల రాజేందర్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈటెల మర్యాదస్తుడు అనుకున్నాం.. కానీ, ఆయనకు మతి తప్పిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కావాలంటే మీ అధిష్టానాన్ని కాక పట్టుకో.. కానీ మా ముఖ్యమంత్రిని బూతులు తిడితే పదవి వస్తుందనుకోవడం నీ అవివేకానికి నిదర్శమని ఆయన అన్నారు. ఇంత కాలం రాజకీయాల్లో ఉండి చివరకు ఈ స్థితికి వస్తావని మేం అనుకోలేదని, ఈటెల రాజేందర్ ముందు నీ పిచ్చి వాగుడు కట్టి పెట్టి.. ఈ పిచ్చి ప్రేలాపనలు ఆపు అని అన్నారు.
Read Also: Sri Lanka: ఘోర ప్రమాదం.. కొండపై నుంచి బస్సు పడి 21 మంది మృతి..
శాడిస్ట్, సైకో అని మాట్లాడావు.. మాకు అంతకు మించిన మాటలు కూడా వచ్చు.. అది గుర్తు పెట్టుకో అని అన్నారు. 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి నా కొడకా అన్న పదాలు వాడుతున్నవంటే నీ మానసిక స్థితి అర్థమవుతూనే ఉందని, నీ నీచ రాజకీయం కోసం మా ముఖ్యమంత్రి పైన దిగజారుడు భాష ఉపయోగిస్తే మాత్రం సహించమని ఆయన అన్నారు. మీరు నీచ భాష ఆపకపోతే మేం అంతకు మించిన భాషను వాడాల్సి వస్తోందని ఆయన అన్నారు.