మణిపూర్‌లో శాంతిని నెలకొల్పడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంఫాల్‌లో అమిత్ షా ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ ఎన్నిటికీ భారత్‌లో అంతర్భాగమేనని తెలిపారు. చొరబాటు ద్వారా మణిపూర్ జనాభాను మార్చే ప్రయత్నాలు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌ను విచ్ఛన్నం చేసే శక్తులు.. ఐక్యం చేసే శక్తుల మధ్య లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని అమిత్ షా ప్రజలకు పిలుపునిచ్చారు.
Read Also: Attack on CM Jagan Incident: సీఎం జగన్‌పై దాడి ఘటన.. ఐజీ, విజయవాడ సీపీకి ఈసీ కీలక ఆదేశాలు
ఎవరెన్ని కుట్రలు చేసినా మణిపూర్‌ను దేశం నుంచి వేరే చేసే ప్రయత్నాలను ఎప్పటికీ ఒప్పుకోబోమని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రస్తుతం మణిపూర్‌ను ఏకం చేయడానికే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మణిపూర్‌లో మార్పు వస్తేనే.. దేశ భవితవ్యం బాగుంటుందని ప్రధాని మోడీ అంటుంటారని అమిత్ షా గుర్తుచేశారు. మణిపూర్‌లో శాంతి నెలకొల్పడానికి ప్రధాని మోడీ ఎంతగానో కృషి చేశారని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాల్లో బీజేపీని, మిత్రపక్షాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. దీని ద్వారా ప్రపంచానికి చక్కని సందేశం వెళ్తుందని పేర్కొన్నారు. గత కాంగ్రెస్ హయాంలో మణిపూర్ అభివృద్ధి పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఖర్చు చేసిన దానికంటే ఎక్కువగా నాలుగింతలు ఎక్కువగా బీజేపీ మణిపూర్ కోసం ఖర్చు చేసినట్లు అమిత్ షా వివరించారు.
Read Also: AP Heat Wave: ఏపీ ప్రజలకు అలర్ట్.. రెండ్రోజులు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం
షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతేయి డిమాండ్‌కు వ్యతిరేకంగా కొండ జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర జరిగింది. గతేడాది మే 3న జరిగిన ఈ సంఘటన తీవ్ర హింసాత్మకంగా మారింది. ఘర్షణలు చెలరేగి 219 మంది మృతి చెందారు. మహిళలను వివస్త్రలు చేసి నగ్నంగా ఊరేగించిన వీడియోలు దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపాయి. మహిళలపై అత్యాచారం, దాడులతో మణిపుర్ అట్టుడికిపోయింది. ఇక గత వారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అస్సాంకు చెందిన ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రాష్ట్రంలో పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. వివాదాన్ని పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు. దేశమంతా వారి వైపే ఉందని మణిపూర్ ప్రజలకు భరోసా ఇచ్చారు. అందరం కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
మణిపూర్‌లో రెండు దశల్లో ఏప్రిల్ 19, 26 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కాగా.. సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి.