Attack on CM Jagan Incident: విజయవాడలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై రాయి దాడి ఘటన కలకలం సృష్టిస్తుండగా.. అసలు దాడి ఘటనపై వివరాలు రాబట్టే పనిలోపడిపోయారు పోలీసులు.. ఇక, సీఎం జగన్‌పై దాడి ఘటనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (ఏపీ సీఈవో) ఎంకే మీనాకు వివరించారు ఐజీ రవి ప్రకాష్, బెజవాడ సీపీ కాంతి రాణా తాతా.. అయితే, సీఎం జగన్‌పై దాడి ఘటనలో దర్యాప్తును వేగవంతం చేయాలని ఎంకే మీనా ఆదేశాలు జారీ చేశారు.. “మేమంతా సిద్దం” బస్సు యాత్రలో ఇటువంటి దుర్ఘటన ఏ విధంగా చోటు చేసుకుందనే విషయాన్ని సీఈవోకు వివరించారు బెజవాడ సీపీ.. దాడి చేసేందుకు నిందితులకు ఏ విధంగా అవకాశం ఏర్పడిందో సీఈవోకు వివరించారు పోలీసులు. అయితే, పూర్తి స్థాయిలో బందోబస్తు ఉన్నప్పటికీ నిందితులు ఏ విధంగా రాయితో దాడి చేయగలిగారని పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఈ ఘటనలో దర్యాప్తును మరింత వేగవంతం చేసి.. సమగ్ర నివేదికను త్వరగా అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (ఏపీ సీఈవో) ఎంకే మీనా.