Google Pixel 8, Pixel 8 Pro Launch Date in India: ‘ గూగుల్’ తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను త్వరలో భారత్‌లో రిలీజ్ చేయనుంది. అక్టోబర్ 4న నిర్వహించే ‘మేడ్ బై గూగుల్’ పేరిట నిర్వహించే ఈవెంట్‌లో గూగుల్ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్స్.. పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రోను లాంచ్ చేయనుంది. అక్టోబర్ 5 నుంచి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫాన్స్ ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. ఫోన్లతో పాటు పిక్సెల్ వాచ్ 2, బడ్స్ ప్రోను కూడా గూగుల్ లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించి గూగుల్ ఇండియా తన ఎక్స్‌లో ఓ టీజర్‌ను వదిలింది.
గూగుల్ గతంలో పిక్సెల్ 4, 5, 6 సిరీస్ ఫోన్లను రిలీజ్ చేసినా వీటిని భారత్‌కు తీసుకురాలేదు. పిక్సెల్ 4ఏ, 6ఏ, 7ఏ ఫోన్లను మాత్రం భారత్‌లో రిలీజ్ చేసింది. పిక్సెల్ 7, 7 ప్రో ఫోన్లను 2022 అక్టోబర్‌లో భారత్‌లో లాంచ్ చేసింది. ఇప్పుడు పిక్సెల్ 8, 8 ప్రో ఫోన్లను గూగుల్ తీసుకొస్తోంది. అయితే ఈ ఫోన్ల ఫస్ట్ సేల్, ధర లాంటి వివరాలను గూగుల్ వెల్లడించలేదు. త్వరలోనే ఈ వివరాలు తెలియరానున్నాయి.
Also Read: Health Tips: అరికాళ్లలో నొప్పా? ఇలా చేయండి చిటికెలో పోతుంది
గూగుల్ పిక్సెల్ 8 ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ ఆండ్రాయిడ్ 14తో వచ్చే అవకాశం ఉంది. పిక్సెల్ 8లో టెన్సర్ జీ3 ప్రాసెసర్, 4485 ఎంఏహెచ్ బ్యటరీ, 24W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండనున్నాయి. పిక్సెల్ 8 ప్రో 4950 ఎంఏహెచ్ బ్యాటరీ, 27W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో రానున్నాయి. వేరియంట్‌ను బట్టి ధర రూ. 78 వేల నుంచి రూ. 1.30 లక్షలు ఉండే అవకాశం ఉంది. ధర, స్పెసిఫికేషన్లు తెలియాలంటే లాంచ్ ఈవెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.