Malli Pelli: సీనియర్ నటుడు నరేష్- పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. సినిమా పరంగానే కాకుండా వీరిద్దరి ప్రేమ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి ఎఫైర్, వివాదాలు.. ఎంత రచ్చ చేశాయో అందరికి తెల్సిందే. ఇక అదంతా మళ్లీ పెళ్లి లో చూపించేశాడు నరేష్. ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే26 న రిలీజై మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. నరేష్ జీవిత సత్యాలు అని చెప్పడంతో కొద్దిగా ఆసక్తి చూపించిన అభిమానులు.. సినిమా మొత్తం నరేష్ వెర్షన్ లో ఉండడంతో.. పెదవి విరిచేశారు. ఇక వీరిద్దరి రొమాన్స్ అయితే అభిమానులు కొంతమంది ఎంజాయ్ చేసినా.. మరికొంతమంది విమర్శించారు.
Kajal Agarwal : ఆ సినిమా కోసం భారీగా పారితోషకం తీసుకున్న కాజల్..?
ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఓటిటీ బాట పట్టింది. థియేటర్ లో ఈ కళాకండాన్ని చూడలేని వారు ఓటిటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. జూన్ 23 నుంచి ఈ సినిమా అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్ లో నిరాశపర్చిన ఈ రొమాంటిక్ జంట ఓటిటీలో ఎలాంటి సందడి చేస్తారో చూడాలి.