Gold Today Rates 1st August 2023 in Hyderabad: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం పెరిగిన పసిడి ధరలు.. సోమవారం స్థిరంగా ఉన్నాయి. నేడు మాత్రం కాస్త తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (ఆగష్టు 1) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,250 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,2800గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 తగ్గింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,430గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 55,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,280గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,500లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,550 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,250లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర 60,410గా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,280 వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 55,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,280గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,250 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,280గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 55,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,280 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరలు మాత్రం రెండు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర మంగళవారం రూ. 77,000లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై ఏ మార్పు లేదు. ముంబైలో కిలో వెండి ధర రూ. 77,000గా ఉండగా.. చెన్నైలో రూ. 80,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,500గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 80,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 80,000ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Maharashtra Girder Accident: కుప్పకూలిన గిర్డర్ యంత్రం.. 15 మంది మృతి!
Also Read: LPG Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. రూ. 100తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర