Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Sales Decline: దేశంలో బంగారం ధరలు అమాంతం పెరగడం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో పసిడి మార్కెట్ తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. సాధారణంగా పెళ్లిళ్ల సీజన్లో కళకళలాడాల్సిన బంగారం దుకాణాలు ఇప్పుడు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బంగారం కొనుగోళ్లపై చేసిన వ్యాఖ్యలు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ అంశంపై ఎన్టీవీతో మాట్లాడిన ఏపీ గోల్డ్ అండ్ సిల్వర్ మర్చంట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి బంగారం కొనవద్దని చేసిన పిలుపు తర్వాత ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని, దాని ప్రభావంతో బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ముందుకు రావడం లేదని తెలిపారు.
గత రెండు నుంచి మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో బంగారం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో కూడా షాపులకు ఆశించిన స్థాయిలో కస్టమర్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గోల్డ్ దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చిందన్నారు. ఈ నిర్ణయం కారణంగా భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
గోల్డ్ బాండ్ల స్కీమ్ ప్రభావం కూడా కేంద్రంపై ఎక్కువగా పడిందని సత్యనారాయణ పేర్కొన్నారు. గోల్డ్ బాండ్లపై వడ్డీలు చెల్లించడం కేంద్రానికి భారంగా మారిందని, అందుకే బంగారం కొనుగోళ్లను తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోందని వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బంగారం పరిశ్రమ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోందని, ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ సమస్యలను వివరించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు. బంగారం ధరలు భారీగా పెరగడం, కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలు కలిపి మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులను సృష్టిస్తున్నాయని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..