Check Latest Gold and Silver Prices in Hyderabad: బుధవారం స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు.. నేడు పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం (జులై 13) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,620లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 210 పెరిగింది. ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం 6 గంటలకు నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,770గా ఉంది.
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620గా నమోదైంది.
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000లు ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,650లుగా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620లుగా ఉంది.
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620వద్ద కొనసాగుతోంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620గా ఉంది.
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,650 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620గా నమోదైంది.
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,620 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు బంగారం బాటలోనే వెండి ధరలు కూడా నడిచాయి. దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర గురువారం రూ. 73,600లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 200 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 73,600లుగా ఉండగా.. చెన్నైలో రూ. 77,000లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 73,000గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ. 77,000లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 77,000ల వద్ద కొనసాగుతోంది.
Also Read: Elon Musk: మరో కొత్త బిజినెస్ లోకి అడుగు పెట్టిన ఎలాన్ మస్క్..
Also Read: Fake watch : యాపిల్ వాచ్ ఆర్డర్ ఇస్తే ఫేక్ వాచ్ డెలివరీ.. క్షమాపణలు చెప్పిన అమెజాన్..