Gold Prices: వరుసగా మూడు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు నేడు తిరిగి భారీగా పెరిగాయి. ప్రస్తుతం అమెరికాలో కొనసాగుతున్న ఆందోళలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రపంచ వాణిజ్య పరిస్థితులు బంగారం, వెండి వంటి లోహాల ధరలపై భారీగా ప్రభావితం చేస్తోంది.
Read Also: Singer Mangli : సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి పట్టివేత..
ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ లో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 820 పెరిగి 10 గ్రాములకు ధర రూ. 98,400 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 పెరిగి 10 గ్రాములకు ధర రూ. 90,200గా, 18 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.610 పెరిగి రూ. 73,190 వద్ద ట్రేడ్ అవుతుంది.
Read Also: Gali Janardhan Reddy: గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట
ఇది ఇలా ఉండగా బంగారం ధరలు భారీగా పెరిగిన వెండి ధరలలో మాత్రం ఎటువంటి మార్పు లేకపోవడం సంతోషకరమైన విషయం. హైదరాబాద్ లో కేజీ వెండి ధర నిన్నటి ధరలో ఎటువంటి తేడా లేకుండా రూ. 1,19,000 వద్ద ట్రేడ్ అవుతోంది.