Gold Rate Today in Hyderabad on 27th May 2024: బంగారం ప్రియులకు షాకింగ్ న్యూస్. గత వారం రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు.. నేడు భారీగా పెరిగాయి. సోమవారం (మే 27) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,650గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,710 వద్ద కొనసాగుతోంది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరగ్గా.. 24 క్యారెట్లపై రూ.270 పెరిగింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,800గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,860గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,650 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,710గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,200.. 24 క్యారెట్ల ధర రూ.73,310గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,650 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,710గా నమోదైంది.
Also Read: KKR vs SRH: అతడే మమ్మల్ని దెబ్బ కొట్టాడు: పాట్ కమిన్స్
నేడు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండిపై ఏకంగా రూ.1500 పెరిగి.. రూ.93,000గా ఉంది. ఈరోజు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.93,000 కాగా.. ముంబైలో రూ.93,000గా ఉంది. చెన్నైలో రూ.97,500లుగా నమోదవగా.. అత్యల్పంగా బెంగళూరులో రూ.92,000గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.97,500లుగా నమోదైంది.