Gold Price Today in Hyderabad on 9 August 2024: గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. తులం గోల్డ్ రేటు దాదాపు రూ.1300 పైన దిగొచ్చింది. పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది కాబట్టి పసిడి ధరలు తగ్గాయని సంతోషించేలోపే.. మళ్లీ షాకిచ్చాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.750, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.820 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (ఆగష్టు 9) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,250గా.. 24 క్యారెట్ల ధర రూ.70,090గా నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,250గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,090గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.64,440 పలకగా.. 24 క్యారెట్ల ధర రూ.70,240గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,250 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.70,090గా ఉంది.
Also Read: Paris Olympics 2024: మరీ అందంగా ఉందని.. పారిస్ ఒలింపిక్స్ నుంచి పంపించేశారు! చివరకు షాక్
మరోవైపు ఇటీవల తగ్గుతూ వచ్చిన వెండి ధర కూడా నేడు భారీగా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1500 పెరిగి.. రూ.83,000కు చేరుకుంది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయాయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర రూ.88,000గా నమోదైంది. ఢిల్లీలో రూ.83,000గా.. ముంబైలో రూ.83,000గా ఉంది. అత్యల్పంగా బెంగళూరులో రూ.80,750గా నమోదైంది.