Paraguay Swimmer Luana Alonso announced Retirement: ‘అందం’ దేవుడిచ్చిన వరం. కళ్లు తిప్పుకోలేని అందం ఉన్న ఎందరో అమ్మాయిలు ఈ ప్రపంచంలో ఉన్నారు. అందులో పరాగ్వేకు చెందిన యువ స్విమ్మర్ ‘లువానా అలోన్సో’ ఒకరు. అయితే చూపుతిప్పుకోలేని ఆ అందమే ఆమెకు శాపంగా మారింది. తోటి క్రీడాకారులను లువానా తన అందచందాలతో ఇబ్బందికి గురిచేస్తుందని.. పరాగ్వే ఒలింపిక్ అధికారులు చర్యలు తీసుకున్నారు. లువానాను పారిస్ ఒలింపిక్స్ నుంచి పంపించేశారు. అయితే చివరకు ఆమె ఓ షాక్ ఇచ్చారు.
పరాగ్వేకు చెందిన 20 ఏళ్ల స్విమ్మర్ లువానా అలోన్సో పారిస్ ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్నారు. జులై 27న జరిగిన 100 మీటర్ల మహిళా బటర్‌ఫ్లై సెమీఫైనల్స్ పోటీల్లో ఆమె ఓడిపోయారు. సెమీఫైనల్స్‌లో ఓడినా.. ఒలింపిక్స్ ముగిసే వరకు పారిస్‌లోనే ఉండేందుకు ఆమెకు పరాగ్వే బృందం అనుమతి ఇచ్చింది. దీంతో మ్యాచ్‌లు చూస్తూ పారిస్ నగరంలో ఎంజాయ్ చేశారు. ఈక్రమంలో లువానా స్విమ్ సూట్‌లతో కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. అక్కడ ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.
Also Read: Arshad Nadeem Histroy: చరిత్ర సృష్టించిన పాక్ అథ్లెట్ అర్షద్.. ఒలింపిక్స్ హిస్టరీలోనే..!
పరాగ్వే బృందం మొత్తం లువానా అలోన్సో అందాలకు ఫిదా అయ్యారు. ఆమెతో మాట్లాడడానికి, ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారు. లువానా తన అందంతో పరాగ్వే క్రీడాకారుల దృష్టి మరల్చుతోందని భావించిన ఆ దేశ ఒలింపిక్ బృందం చర్యలు తీసుకుంది. ఉన్నపళంగా లువానాను సొంత దేశానికి పంపించింది. పారిస్ నుంచి పరాగ్వే చేరుకున్న లువానా.. మరుసటి రోజే ఊహించని షాక్ ఇచ్చారు. స్విమ్మింగ్‌కు రిటైర్మెంట్ ఇచ్చారు. తనకు మద్దతుగా నిలిచిన పరాగ్వే దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అయితే తనను పారిస్ నుంచి పంపిన విషయంపై మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.