హమ్మయ్య.. బంగారం.. వెండి ధరలు దిగొచ్చాయి. గత కొద్దిరోజులగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. గోల్డ్, సిల్వర్ పోటాపోటీగా రాకెట్లా దూసుకుపోయాయి. సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తూ కొనుగోలుదారులను బెంబేలెత్తించాయి. అలాంటిది బుధవారం అగ్ర రాజ్యాధినేతల నుంచి వచ్చిన సానుకూల ప్రకటనలు పసిడి పరుగులకు బ్రేక్‌లు పడేలా చేశాయి. భారతదేశంతో వ్యూహాత్మక, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకుంటున్నట్లు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా లేయెన్ ప్రకటించారు. అలాగే అతి త్వరలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం పూర్తవుతుందని ట్రంప్ ప్రకటించారు. ఈ ఇద్దరి నేతల ప్రకటనతో బంగారం, వెండి ధరలు దిగొచ్చినట్లుగా కనబడుతోంది. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.2,290 తగ్గగా.. కిలో వెండిపై రూ.5,000 తగ్గింది.
ఇది కూడా చదవండి: Trump: ‘బోర్డ్ ఆఫ్ పీస్’’పై అగ్ర రాజ్యాలు ఘర్షణ.. కారణమిదేనా..!?
తులం గోల్డ్‌పై రూ.2,290 తగ్గడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,54,310 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.2,100 తగ్గడంతో రూ.1,41,450 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,720 తగ్గడంతో రూ.1,15,730 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Trump: వాళ్లిద్దరితో మంచి సంబంధాలున్నాయి.. ఏప్రిల్‌లో దక్షిణాసియా వస్తున్నట్లు ట్రంప్ ప్రకటన
ఇక సిల్వర్‌కు బ్రేకులు పడ్డాయి. ఈరోజు కిలో వెండిపై రూ.5,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.3,25, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.3,40,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.3,25, 000 దగ్గర అమ్ముడవుతోంది.