యువ నటులు నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘చైనా పీస్’. యూనిక్ స్పై డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే తన టీజర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు హ్యూమర్‌ను జోడించి తెరకెక్కించిన ఈ సినిమా నుంచి తాజాగా ‘భగ భగ’ అనే పవర్ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ పాట ఇప్పుడు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
Also Read : Sara Arjun : పనితోనే గుర్తింపు కావాలి.. స్టార్ ట్యాగ్ కాదు
కార్తీక్ అద్భుతమైన ట్యూన్ అందించగా, కాల భైరవ తన పవర్ ఫుల్ వాయిస్‌తో ఈ పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లారు. రెహమాన్ రాసిన లిరిక్స్ ప్రతి భారతీయుడిలో దేశభక్తిని రగిలించేలా ఉన్నాయి. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాలో కమల్ కామరాజు, రఘు బాబు, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఫిబ్రవరి చివర్లో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఒక విభిన్నమైన స్పై థ్రిల్లర్‌ను చూడాలనుకునే వారికి ‘చైనా పీస్’ మంచి ఛాయిస్ అవుతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.