Gold and Silver Prices: ఆల్‌టైం హై రికార్డులను సృష్టించిన బంగారం, వెండి ధరలు.. సామాన్యులు కొనలేని పరిస్థితికి వెళ్లిపోయాయయే ఆందోళన ఉంది.. అయితే, బంగారం కొనుగోలు చేసేవారు మాత్రం వెనక్కి తగ్గడం లేదనే చెప్పాలి.. ఇప్పుడు.. బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూసేవారికి భారీ ఊరట దక్కింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.. బంగారం ధర తులంపై దాదాపు రూ.2 వేల వరకు తగ్గగా.. కిలో వెండి ఏకంగా రూ.8వేలకు పైగా పడిపోయింది.. దీంతో, బంగారం, వెండి కొనే ప్లాన్ చేసుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెబుతున్నారు విశ్లేషకులు..
Read Also: Bobby : జక్కన్నలా చెక్కుతున్న బాబీ
కాగా, ఆల్ టైం హై రికార్డు సృష్టించిన బంగారం, వెండి ధరలు.. పైకి.. కిందకు కదులుతూనే ఉన్నాయి.. తగ్గినప్పుడు కాస్తా తగ్గిన.. పెరిగినప్పుడు పెద్ద మొత్తంలో పెరుగుతుందనే ఆందోళనలు ఉన్నాయి.. కానీ, ఈ రోజు కొంత ఊరట కల్పిస్తూ.. పసిడి, సిల్వర్ ధరలు భారీగానే దిగివచ్చాయి.. ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ1,960 తగ్గడంతో రూ.1,25,080కి దిగివచ్చింది.. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ1,800 తగ్గడంతో రూ.1,14,650కి పడిపోయింది.. మరోవైపు కిలో వెండి ధర రూ.8,100 తగ్గడంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,75,000కు దిగివచ్చినట్టు అయ్యింది..
Read Also: Bobby : జక్కన్నలా చెక్కుతున్న బాబీ
ఈ రోజు హైదరాబాద్ లో 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.12,508గా ఉండగా.. 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,465 గాను, 1 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర రూ.9,381గా ఉంది.. ఇదే సమయంలో.. ఒక గ్రాము వెండి ధర రూ.175 గాను ఒక కిలో వెండి ధర రూ.1,75,000 గాను ఉంది. కాగా, తరతరాలుగా బంగారం స్థిరమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక హెచ్చుతగ్గులు వంటి వివిధ సవాళ్ల మధ్య, బంగారం తరచుగా దాని విలువను నిలుపుకుంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు, బంగారం ఒక అద్భుతమైన ఎంపికగా చూస్తారు.. పెళ్లి, ఇతర శుభకార్యాల కోసం బంగారం, వెండి కొనుగోలు చేసేవారు కొందరైతే.. దీనిపై పెట్టుబడి పెట్టేవారి సంఖ్యే ఎక్కువగా ఉండే విషయం విదితమే..