ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరాలలో దుబాయ్ ఒకటి. అక్కడ ఆకాశాన్ని తాకే ఎత్తైన భవనాలు, ప్రత్యేకమైన ద్వీపాలు మరియు విలాసవంతమైన మాల్స్ ఉంటాయి. అందుకే దుబాయ్ ని ‘సిటీ ఆఫ్ గోల్డ్’ అని కూడా పిలుస్తారు. దుబాయ్‌లో ఉండే షేక్‌లు చాలా మంది ధనవంతులే ఉంటారు. వారు సంపాదించిన ధనాన్ని ఖర్చు పెట్టేందుకు ఖరీదైన వాహనాలు, వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. అంతేకాకుండా ఏదైనా వస్తువును తయారు చేయడానికి కూడా.. డబ్బును బీభత్సంగా ఖర్చు చేస్తారు. దుబాయ్ షేక్ ల ఆలోచనలు ఎలా ఉంటాయంటే.. ప్రపంచంలోనే వింతంగా ఏదైనా తయారు చేయలనేలా ఉంటాయి. అందులో భాగంగా.. ఓ వ్యక్తి భారీ కారును తయారు చేశాడు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Gidugu Rudraraju: మణిపూర్ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు..
షేక్ ఓ భారీ ‘బాహుబలి’ కారును తయారు చేసాడు. సోషల్ మీడియాలో ఆ కారు వీడియో చూసిన జనాలు అవాక్కవుతున్నారు. ఆ కారు ఎంత పొడవు, వెడల్పు ఉందో వీడియోలో మీరు చూడవచ్చు. ఈ కారును మనుషుల కోసం కాకుండా ఏనుగులు ప్రయాణించేందుకు తయారు చేసినట్టు అనిపిస్తోంది. దాని చక్రాలు చాలా పెద్దవిగా.. దాని ముందు నిలబడితే మనుషులు కూడా చిన్నగా కనడుతారు. మీరు హమ్మర్ కార్‌ని చూసి ఉంటారు.. కానీ ఇంత పెద్ద కారుని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. కేవలం లుక్స్ కోసమే ఈ హమ్మర్‌ని తయారు చేశారనేది కాదు. ఈ ‘బాహుబలి’ కారు UAE రాజకుటుంబానికి చెందిన హుమర్ షేక్ హమద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్‌కు చెందినది.
Rithu Chowdary: లవ్లో ఫెయిలైన జబర్దస్త్ భామ.. త్వరలో అన్నీ బయటపెడుతుందట!
ఈ కారు పొడవు 14 మీటర్లు, వెడల్పు 6 మీటర్లు, ఎత్తు 5.8 మీటర్లు. ఈ కారులో పడకగది మరియు టాయిలెట్ సౌకర్యం కూడా ఉంది. ఈ కారు వీడియో @Rainmaker1973 అనే IDతో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను 20 మిలియన్లకు పైగా వీక్షించారు. 62 వేల మందికి పైగా ప్రజలు వీడియోను లైక్ చేసారు. అంతేకాకుండా నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
Dubai Rainbow Sheikh’s giant Hummer H1 “X3” is three times bigger than a regular Hummer H1 SUV (14 meters long, 6 meters wide, and 5.8 meters high). The Hummer is also fully drivable
[read more: https://t.co/LlohQguhTM]pic.twitter.com/uV1Z4juHKx
— Massimo (@Rainmaker1973) July 27, 2023