Dowleshwaram Barrage: గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- ఎగువ ప్రాంతాల నుండి భారీగా వస్తున్న వరదనీరు
- బ్యారేజ్ వద్ద 13.75 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dowleshwaram Barrage: గోదావరి ఉగ్రరూపంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను మించి ప్రవహిస్తోంది. బ్యారేజ్ వద్ద వరద నీటిమట్టం 13.75 అడుగుల వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ నుండి 13 లక్షల 261 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీనితో భద్రాచలం దిగువన విలీన మండలాల నుంచి కోనసీమ వరకూ పరివాహక ప్రాంతాల ప్రజలు వరద కష్టాలు ఎదుర్కొంటున్నారు. కోనసీమ లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు కనకాయలంక కాజ్ వే పై రాకపోకలు స్తంభించాయి. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలలో చేపడుతున్నారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
Read Also: AP Assembly: రెండో రోజు ప్రశ్నోత్తరాలు, కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతంరెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది.. 51.30 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. గత రాత్రి నుంచి స్వల్పంగానే గోదావరి పెరుగుతున్నప్పటికీ మూడో ప్రమాద హెచ్చరిక వచ్చే స్థాయికి వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే భద్రాచలం నుంచి చర్ల, వాజేడు, వెంకటాపురం వెళ్లే రహదారిపై నీళ్లు వచ్చాయి. అదే విధంగా గత మూడు రోజుల నుంచి విలీన మండలాలకు వెళ్లే రోడ్ల మీదకి నీళ్లు రావడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అదే విధంగా విలీన మండలాల్లో అనేక గ్రామాల చుట్టూ గోదావరి చేరుకుంది. అయితే ఎగువ నుంచి మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి వరద తీవ్రత కొంత తగ్గిందని సమాచారం. ఈ నేపథ్యంలో గోదావరి మరో రెండు అడుగులు పెరిగి తగ్గవచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే నిన్నటి వరకు గోదావరి దిగువన వున్న శబరి నది భారీగా పెరిగి మళ్ళీ తగ్గి గత రాత్రి నుంచి మళ్లీ పెరుగుతుంది. శబరి పెరిగితే గోదావరికి ప్రమాదకరంగా వుంటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!