Modi-Meloni: ఇటీవల రోమ్‌లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్‌పై మెలోని అభినందనలు
- భారత చరిత్రలో మీ రికార్డ్ అద్భుతం
- ఇటీవల రోమ్‌లో కలవడం ఆనందంగా ఉంది
- మోడీ రికార్డ్‌పై మెలోని అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ చరిత్ర సృష్టించారు. ఏకధాటిగా దేశాన్ని 12 ఏళ్ల పాటు పాలించిన ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. దేశ మొట్టమొదటి ప్రధాని నెహ్రూ రికార్డ్‌ను మోడీ అధిగమించారు. ఈ సందర్భంగా దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వస్తున్నాయి. ప్రధాని మోడీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్-ఇటలీ సంబంధాలను ఎక్స్ వేదికగా గుర్తుచేసుకున్నారు.
‘‘ఈరోజు భారత చరిత్రలో అత్యంత కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన నరేంద్ర మోడీకి అభినందనలు” అని పేర్కొన్నారు. ఇటీవల రోమ్‌లో మోడీతో జరిగిన సమావేశాన్ని కూడా మెలోని గుర్తు చేసుకున్నారు. “కొన్ని వారాల క్రితం రోమ్‌లో మళ్లీ మోడీని కలవడం ఆనందంగా ఉంది. ఇరు దేశాల ప్రజలకు కొత్త అవకాశాలు సృష్టించేలా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రారంభించాం” అని మెలోని తెలిపారు.
Also Read
- IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
- Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
- US Strikes on Iran: ఇరాన్‌పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
- SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
జూన్ 10, 2026 నాటికి ప్రధాని మోడీ వరుసగా 4,399 రోజులు ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతూ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కాలాన్ని అధిగమించారు. 2014 మే 26న తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ.. 2019లో రెండోసారి.. 2024లో మూడోసారి వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చారు.
ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ప్రకారం.. మోడీ-మెలోనీ సమావేశంలో 2025-2029 ఇండియా-ఇటలీ జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ అమలుపై సమీక్ష నిర్వహించారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, విజ్ఞానశాస్త్రం, సాంకేతికత, పరిశోధన, అంతరిక్షం, ఇంధనం, కృత్రిమ మేధస్సు (AI), కీలక సాంకేతిక రంగాలు, విద్య, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల విస్తరణపై సహకారాన్ని మరింత పెంచాలని నిర్ణయించారు. అలాగే విదేశాంగ మంత్రుల స్థాయిలో ప్రత్యేక సమీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. 2029 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ యూరోలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. రక్షణ రంగంలో సంయుక్తంగా డిజైన్, అభివృద్ధి, ఉత్పత్తి కార్యక్రమాలకు సంబంధించిన అవగాహన ఒప్పందాలను కూడా స్వాగతించినట్లు పీఎంఓ తెలిపింది. అదనంగా ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) ప్రాజెక్టుపై కూడా కలిసి పనిచేయాలని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి.
భారత్-ఇటలీ సంబంధాలు 2023లో మెలోనీ భారత్ పర్యటన సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్యంగా ప్రారంభమయ్యాయి. అనంతరం 2024లో జీ20 సదస్సు సందర్భంగా 2025-2029 జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్‌కు రూపకల్పన చేశారు. ఇప్పుడు ఆ బంధాలను మరింత బలోపేతం చేస్తూ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లడం ఇరు దేశాల సంబంధాల్లో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్‌లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్‌పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్‌ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!