Kishore and Shruthy Menon starrer Vadakkan selected at the BIFFF: ఈ మధ్య ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులోకి కూడా తెస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా ఒక మలయాళ సినిమా కూడా తెలుగులోకి వచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ కిషోర్, శ్రుతి మీనన్ నటించిన వడక్కన్ మూవీ ప్రపంచ స్థాయి వేదికపై మెరిసింది. రసూల్ పూకుట్టి, కీకో నకహరా, బిజిబాల్, ఉన్నిఆర్ సంయుక్తంగా నిర్మించగా.. సాజీద్ ఎ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. బ్రస్సెల్స్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ (BIFFF )లో స్థానం సంపాదించుకున్న ఈ సినిమాను ఆఫ్‌బీట్ మీడియా గ్రూప్ అనుబంధ సంస్థ ఆఫ్‌బీట్‌స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా ప్రాచీన ఉత్తర మలబార్ జానపద కథల నేపథ్యంలో సాగుతుంది. సమస్యాత్మకమైన వస్త్రాన్ని నేయడం ద్వారా ఈ థ్రిల్లర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
Nabha Natesh: హీరోయిన్‌ను డార్లింగన్న ప్రియదర్శి.. మాటలు జాగ్రత్త అంటూ నభా వార్నింగ్!
తమ మలయాళ సినిమాకు ఇంతటి గుర్తింపు రావడంతో భ్రమయుగం, భూతకాలం దర్శకుడు రాహుల్ సదాశివన్ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఇలా పేర్కొన్నారు. ‘వడక్కన్‌కి లభించిన అంతర్జాతీయ గుర్తింపు చాలా సంతోషకరమైనదని, మలయాళ చిత్రసీమను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఆఫ్‌బీట్ మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు & నిర్మాత, జైదీప్ సింగ్ మాట్లాడుతూ ‘వడక్కన్‌తో ప్రపంచ స్థాయి కాస్ట్ & క్రూతో గ్లోబల్ సెన్సిబిలిటీలతో హైపర్ లోకల్ కథనాలను చెప్పడం ద్వారా భారతీయ సినిమాని పునర్నిర్వచించడమే మా లక్ష్యమని అన్నారు. వడక్కన్ ని ఈ సంవత్సరం కేన్స్‌లో మే నెలలో ప్రదర్శించనున్నారు. అనంతరం వడక్కన్ ని కన్నడ, తమిళం, తెలుగు భాషల్లోకి డబ్ చేయనున్నారు.