NTV Telugu Site icon

GHMC : ముగిసిన జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక నామినేషన్ల గడువు

Ghmc

Ghmc

GHMC : స్టాండింగ్ కమిటీ ఎన్నిక నామినేషన్ దాఖలుకు గడువు పూర్తయింది. ఈ నెల 10 వ తేదీ నుండి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలుకు అవకాశం కల్పించారు రిటర్నింగ్ అధికారి.. గడువు పూర్తయ్యే సమయానికి స్టాండింగ్ కమిటీ ఎన్నికకు మొత్తం 17 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుండి ఏడు నామినేషన్లు దాఖలు కాగా.. ఎంఐఎం నుండి 8 ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ నుండి 2 నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు బీజేపీ కార్పొరేటర్లు దూరంగా ఉన్నారు. నామినేషన్లు దాఖలు చేసిన అన్ని పార్టీల అభ్యర్థుల పేర్లను అధికారికంగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దాఖలైన నామినేషన్ల పై రేపు కమిషనర్ సమక్షంలో స్కూటీనీ నిర్వహించనున్నారు రిటర్నింగ్ అధికారి. స్కూటినీ అనంతరం ఫైనల్ లిస్టును రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు. స్కూటిని తరువాత 21 వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ కు అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ నుండి దాఖలైన రెండు నామినేషన్లు ఉపసంహరణ జరిగితే స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ సభ్యులు ఉపసంహరణ చేసుకోకపోతే మాత్రం 25 వ తేదీన ఎన్నిక జరగనుంది.

Bangladesh : ఈద్ సందర్భంగా బంగ్లాదేశ్ యూనస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లబ్ధిపొందనున్న 20లక్షల కుటుంబాలు

ఈ సందర్భంగా రిటర్నింగ్ ఆఫీసర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఈ నెల 5న నోటిఫికేషన్ ఇచ్చామని, 10 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరించామని తెలిపారు. మొత్తం 17 నామినేషన్లు వచ్చాయని, రేపు నామినేషన్లు స్క్రూటినీ చేస్తామన్నారు. 21 వరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకోవచ్చు అని, 15 నామినేషన్లు మాత్రమే ఉంటే ఏకగ్రీవం అవుతుందన్నారు. 15 కన్నా ఎక్కువ నామినేషన్లు ఉంటే ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 15 కి పైగా నామినేషన్లు ఉంటే ఈ నెల 25 న పోలింగ్ ఉంటుంది.. అదే రోజు రిజల్ట్స్ వెల్లడిస్తామని, 2014 నుంచి స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక అవుతుందన్నారు.

Karnataka : తమ్ముడిని చంపి తప్పించుకుందాం అనుకున్నాడు.. కుంభమేళాక పోయివచ్చి దొరికిపోయాడు