West Bengal: కాలేజీలో డబ్బు, గన్స్, కండోమ్‌లు.. బెంగాల్లో రాజకీయ దుమారం..
- కాలేజీ గదిలో దాదాపు రూ.1 కోటి నగదు
- రివాల్వర్, మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు గుర్తింపు
- కోల్‌కతా సురేంద్రనాథ్ కాలేజీలో ఘటన
- టీఎంసీ అరాచకాలపై బీజేపీ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal: పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు వేడెక్కతున్నాయి. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్(సంక్షోభం) దిశగా వెళ్తోంది. ఇదిలా ఉంటే, మరో రాజకీయ దుమారం చెలరేగింది. కోల్‌కతాలోని అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో ఒకటైన సురేంద్రనాథ్ కళాశాల ఒక పెద్ద వివాదానికి కేంద్రంగా నిలిచింది. కాలేజీలోని విద్యార్థి సంఘం గదిలో కోటి రూపాయల నగదు, రెండు ఏసీ బెడ్రూంలు, మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు, ఒక రివాల్వర్ దొరకడం సంచలనంగా మారింది. దీంతో బీజేపీ, టీఎంసీపై తీవ్ర ఆరోపణలు చేసింది.
విద్యా్ర్థి సంఘం ఎన్నికలు జరగకపోవడం వల్ల కాలేజీలోని విద్యార్థి సంఘం హాళ్లను మూసేయాలని 2025లో కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఏడాది తర్వాత స్టూడెంట్ యూనియన్ గదిని తెరిచారు. దక్షిణ కోల్‌కతా లా కాలేజీలో విద్యార్థినిపై స్టూడెంట్ యూనియన్ గదిలో అత్యాచారం జరిగిన తర్వాత కోర్టు ఈ ఆదేశం ఇచ్చింది. అయితే, ఇటీవల బీజేపీ సర్కార్ కాలేజీ విద్యార్థి సంఘ నిధుల ఖర్చులపై ఆడిట్‌కు ఆదేశించింది. దీంతో కాలేజీ యాజమాన్యం మంగళవారం స్టూడెంట్ యూనియన్ గదిని శుభ్రపరిచే సమయంలో ఈ వస్తువులు వెలుగులోకి వచ్చాయి.
Also Read
- PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
- LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
గదిలోని అల్మారాలో చెదలు పట్టిన స్థితిలో 100, 500 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. చాలా కాలంగా ఈ డబ్బు అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. కాలేజీ అడ్మిషన్ల సమయంలో జరిగిన అవకతవకలు, అక్రమ వసూళ్లతో ఈ డబ్బుకు సంబంధం ఉందని బీజేపీ ఆరోపించింది. ఈ గదుల్లో ఏసీలు, అటాచ్డ్ టాయిలెట్స్, ఖరీదైన పరుపులు ఉన్నాయి. గతంలో తృణమూల్ సర్కార్ లోని కొంతమంది రాజకీయ నాయకులు ఈ గదుల్ని ఉపయోగించేవారని కాలేజీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఈడీతో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని పలు కాలేజీల్లో అడ్మిషన్ ఇప్పిస్తామని విద్యార్థుల నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?