GHMC Notices: హైదరాబాద్‌లోని ప్రముఖ సినీ స్టూడియోలైన అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోస్‌లపై GHMC బల్దియా అధికారులు కఠిన చర్యలను చేపట్టారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరుతో భారీ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్టు గుర్తించిన బల్దియా, రెండు స్టూడియోలకూ నోటీసులు జారీ చేసింది. వ్యాపార విస్తీర్ణాన్ని కావాలనే తక్కువగా చూపిస్తూ సంవత్సరాలుగా తక్కువ మొత్తంలోనే ఫీజులు చెల్లిస్తున్న వాస్తవం వెలుగుచూసింది.
బల్దియా సర్కిల్–18 అధికారులు చేసిన తాజా పరిశీలనల్లో.. అన్నపూర్ణ స్టూడియో వాస్తవానికి 11.52 లక్షలు ట్రేడ్ లైసెన్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉండగా, కేవలం 49 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్టు బయటపడింది. ఇదే విధంగా రామానాయుడు స్టూడియోస్ అయితే 1.92 లక్షలు చెల్లించాల్సిన స్థానంలో కేవలం 1,900 రూపాయలు మాత్రమే చెల్లించినట్టు అధికారులు గుర్తించారు.
IND vs SA 2nd Test: భారీ ఒత్తిడిలో భారత్.. మార్పులు తప్పవా..?
స్టూడియోలు చూపిన విస్తీర్ణం కంటే నిజానికి చాలా పెద్దదిగా ఉండటంతో.. చెల్లించాల్సిన ఫీజులో భారీ వ్యత్యాసం కనిపించింది. ఈ తప్పుడు వివరాల కారణంగా బల్దియా ఖజానాకు గణనీయమైన నష్టం వాటిల్లినట్టు అధికారులు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతపై సీరియస్‌గా స్పందించిన GHMC పూర్తి స్థాయిలో బకాయి ఫీజులను చెల్లించాలని స్టూడియోలకి అధికారిక నోటీసులు పంపింది. స్టూడియోల నుంచి పూర్తి వివరణతో పాటు, అసలైన విస్తీర్ణం ఆధారంగా ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయాలని బల్దియా సూచించింది.