Hyderabad: మోమోస్ ఫుడ్ పాయిజన్ పై స్పందించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్..
- నిన్న నంది నగర్ లో జరిగిన మోమోస్ ఫుడ్ పాయిజన్ పై స్పందించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్
- మోమోస్ తిని అస్వస్థతకు గురయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది- లక్ష్మీకాంత్
- ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ని పంపించి ఎంక్వైరీ చేయించాం- లక్ష్మీకాంత్
- వీక్లీ సంతలో స్ట్రీట్ వెండర్ వద్ద మోమోస్ తిన్నారనే సమాచారం తెలిసింది- లక్ష్మీకాంత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని నందినగర్‌లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.. మరో 20 మందికి పైగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. మోమోస్ షాప్ నిర్వహిస్తోన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లక్ష్మీకాంత్ స్పందించారు. మోమోస్ తిని అస్వస్థతకు గురయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది.. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌ను పంపించి ఎంక్వైరీ చేయించామని ఆయన తెలిపారు. వీక్లీ సంతలో స్ట్రీట్ వెండర్ వద్ద మోమోస్ తిన్నారనే సమాచారం తెలిసింది.. పోలీసుల సహకారంతో ఆ మోమోస్ తయారు చేసే లొకేషన్‌ను పట్టుకున్నామని పేర్కొన్నారు. చింతల్ బస్తీలో ఒక ఇంట్లో మోమొస్ తయారు చేస్తున్నారని గుర్తించాం.. అక్కడ అపరిశుభ్రంగా ఉండడంతో పాటు అనుమతి లేకుండా నిర్వహించడాన్ని తమ సిబ్బంది గుర్తించారని లక్ష్మీకాంత్ చెప్పారు.
Read Also: Kerala CM Convoy Accident: రోడ్డుపై స్కూటీతో మహిళ విన్యాసం?.. సీఎం కాన్వాయ్కి ప్రమాదం..
Also Read
వెంటనే అక్కడ నుండి ఫుడ్ సాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు పంపడం జరిగింది.. హాస్పిటల్లో ఉన్న బాధితులను కలిసి వారి స్టేట్మెంట్ కూడా తీసుకున్నామని FSO లక్ష్మీకాంత్ తెలిపారు. అవసరమైన టెస్టులు చేసి ఫుడ్ పాయిజన్ అయ్యిందా లేదా అనే రిపోర్ట్ ఇవ్వాలని డాక్టర్లను కోరామన్నారు. ఒక మహిళ చనిపోయిందని కూడా వార్తలు వస్తున్నాయి.. కానీ.. తన మరణానికి ఫుడ్ పాయిజనే కారణమని ఇంకా నిర్ధారణ కాలేదని చెప్పారు. తనకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదు కూడా అందలేదని వెల్లడించారు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అవసరమైన అవేర్నెస్ కూడా ఫుడ్ సేఫ్టీ కల్పిస్తుంది.. వారు వాడే ఆయిల్, ఫుడ్ మెటీరియల్ పై కుడా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని చోట్ల రిపీటెడ్ గా ఫిర్యాదులు వచ్చే వారిపై కేసులు కూడా పెడుతున్నామన్నారు. శవర్మా, మొమొస్ లాంటి ఫాస్ట్ ఫుడ్ వెంటనే కాకుండా నిల్వచేసి తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి ఫుడ్ తినే వారు పార్సెల్ తీసుకుని వెళ్ళాక వెంటనే తినాలని సూచిస్తున్నాము.. నిల్వ చేసి మళ్ళీ వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని FSO లక్ష్మీకాంత్ తెలిపారు.
Read Also: iPhones: చైనాకు షాక్.. ఇండియా నుంచి 6 బిలియన్ డాలర్ల ఐఫోన్లు ఎగుమతి..
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు