హైదరాబాద్‌లోని నందినగర్‌లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.. మరో 20 మందికి పైగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. మోమోస్ షాప్ నిర్వహిస్తోన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లక్ష్మీకాంత్ స్పందించారు.
హైదరాబాద్‌లోని నందినగర్‌లో విషాదం చోటుచేసుకుంది. నంది నగర్‌లో మోమోస్ తిని ఓ మహిళ మృతి చెందగా.. మరో 20 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు్న్నారు. నందినగర్‌లో వారాంతపు సంతలో పెట్టిన మోమోస్‌ను బాధితులు తిన్నట్లు తెలిసింది.
ఈ రోజుల్లో మోమో స్టాల్స్ వీధికి రెండు మూడు ఉన్నాయి. వాటిని ఇష్టపడేవాళ్లు కూడా ఎక్కువే. అయితే మనం తరచూ మోమో తినడం ఆరోగ్యకరమా? అనే విషయం పై పరిశోధనలు చేశారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లోని చీఫ్ డైటీషియన్ భక్తి సమంత్ మాట్లాడుతూ, దీనిని ప్రధానంగా ఆవిరిలో ఉడికించి, కూరగాయలు లేదా మాంసంతో నింపినప్పటికీ, పోషక ప్రయోజనాలు తక్కువగానే ఉన్నాయని చెప్పారు.. మోమోస్ తయారు చేయడానికి ఉపయోగించే లేదా శుద్ధి చేసిన పిండి వంటి…